ALERT: బస్సుల కోసం ఎదురుచూస్తున్నారా?
TG: రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు సమ్మె చేపట్టడంతో బస్సు సేవలు నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో పలువురు ప్రయాణికులకు సమ్మె విషయం తెలియకపోవడంతో బస్టాండ్‌ల వద్ద పడిగాపులు కాస్తున్నారు. మరోవైపు సమ్మెను ఆసరాగా చేసుకుని ప్రైవేట్ బస్సులు, ఆటోలు అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. సామాన్య ప్రజలు, ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.