VIDEO: ఎండు గంజాయి పట్టివేత.. ఇద్దరు అరెస్ట్

VIDEO: ఎండు గంజాయి పట్టివేత.. ఇద్దరు అరెస్ట్

మహబూబాబాద్ పట్టణంలో పోలీసులు రూ.84 వేల విలువైన 1,680 గ్రాముల ఎండు గంజాయిని మంగళవారం స్వాధీనం చేసుకున్నారు. బాలాజీ గార్డెన్ సమీపంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న షేక్ సోహెల్, ఎడ్ల రామ్ చరణ్‌ను తనిఖీ చేయగా, వారి వద్ద గంజాయి లభించడంతో అదుపులోకి తీసుకున్నారు. వారిని రిమాండ్‌కు తరలించారు. గంజాయి సరఫరా చేస్తున్న క్రాంతి కోసం పోలీసులు గాలింపు చేపట్టారు.