గచ్చిబౌలి స్టేడియంలో సమ్మర్ క్యాంప్ ప్రారంభం

HYD: గచ్చిబౌలి స్టేడియంలో సమ్మర్ క్యాంప్ ప్రారంభమైంది. వివిధ క్రీడల్లో విద్యార్థులకు శిక్షణ ఇవ్వనున్నారు. గురువారం స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యంలో ప్రారంభమైన సమ్మర్ క్యాంప్ జూన్ 6వ తేదీ వరకు కొనసాగనుంది. 8 - 18 ఏళ్ల విద్యార్థులకు అవకాశం ఉంటుందని గచ్చిబౌలి స్టేడియం ఏఓ కన్నం మధు తెలిపారు. వివిధ క్రీడల్లో నిపుణులైన కోచ్‌లు శిక్షణ ఇస్తారని చెప్పారు.