కూటమి మోసపూరితమైన హామీలు ఇచ్చింది: తలారి

KKD: కూటమి ప్రభుత్వం మోసపూరితమైన హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందని వైసీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ తలారి వెంకట్రావు ఆరోపించారు. తాళ్లపూడి మండలం పెదవేవంలో ఆదివారం సాయంత్రం బాబు శిరిడి మోసం గ్యారంటీ కార్యక్రమం నిర్వహించారు. అయన మాట్లాడుతూ..చంద్రబాబు మోసపూరిత హామీలను ప్రజలకు తీసుకువెళ్లాలని పార్టీ శ్రేణులకు ఆయన సూచించారు.