డబుల్ బెడ్రూం ఇళ్ల పేరిట మోసం.. అరెస్ట్

HYD: డబుల్ బెడ్రూం ఇళ్ల పేరుతో అమాయక ప్రజల నుంచి డబ్బులు వసూలు చేసి, మోసం చేసిన నాగరాజుపై కేసు నమోదైంది. మేడిపల్లి పోలీసులు అతడిని రిమాండుకు తరలించారు. గత 3 సంవత్సరాల నుంచి పేదలకు ఇల్లు ఆశ చూపి ఇప్పిస్తానని లక్షల్లో వసూలు చేశాడు. సుమారు రూ.5 కోట్ల వరకు వసూలు చేయడం గమనార్హం. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు చర్యలు తీసుకున్నారు.