బొగ్గు గూడ్స్‌లో పొగలు.. తప్పిన ప్రమాదం

VZM: బొగ్గును తరలిస్తున్న గూడ్స్‌లో పొగలు రావడంతో అధికారులు అప్రమత్తమై ప్రమాదాన్ని నివారించారు. విశాఖ పోర్టుకు బొగ్గును మంగళవారం సాయంత్రం తరలిస్తున్న గూడ్స్‌లో పొగలు రావడంతో పక్కనుంచి వెళుతున్న మరో బండి సిబ్బంది గజపతినగరం స్టేషన్‌కు సమాచారం ఇవ్వడంతో స్టేషన్ మాస్టర్ రామకృష్ణారావు బండిని నిలిపివేసి సమాచారాన్ని అగ్రిమాపక కేంద్రానికి అందించారు.