'పరిష్కార వేదికను సద్వినియోగం చేసుకోండి'

TPT: ప్రతి సోమవారం తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో నిర్వహించే డయల్ యువర్ కమిషనర్, ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాలను వినియోగించుకోవాలని కమిషనర్ ఎన్.మౌర్య ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక, ఉదయం 10.30 గంటల నుంచి 11.30 గంటల వరకు డయల్ యువర్ కార్యక్రమం జరుగుతుందని తెలిపారు.