'పేద విద్యార్థులకు ఉచిత స్టడీ సర్కిల్ ఏర్పాటు చేయాలి'

'పేద విద్యార్థులకు ఉచిత స్టడీ సర్కిల్ ఏర్పాటు చేయాలి'

BHPL: జిల్లా కేంద్రంలో CPI(ML) రాష్ట్ర కమిటీ సభ్యులు మల్లేష్, VCK తెలంగాణ రాష్ట్ర యూత్ అధ్యక్షులు అనిల్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. జిల్లాలో వనరులు సమృద్ధిగా ఉన్నా విద్య, వైద్యం, ఉద్యోగాలు అందకుండా నిర్లక్ష్యం చేస్తున్న ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా విమర్శించారు. నిరుపేద విద్యార్థుల కోసం ఉచిత కోచింగ్ సెంటర్లు, స్టడీ సర్కిళ్లు ఏర్పాటు చేయాలన్నారు.