వార్డు మెంబర్లుగా యువ జంటలు గెలుపు

వార్డు మెంబర్లుగా యువ జంటలు గెలుపు

SRCL: స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా నిన్న వెలువడిన ఫలితాల్లో రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం నిమ్మపల్లి గ్రామంలో చిత్రమైన సంఘటన చోటుచేసుకుంది. ఒక వార్డులో గెలువడమే కష్టమైన ఈ రోజుల్లో ఈ గ్రామంలో రెండు యువ జంటలు నాలుగు వార్డుల్లో విజయం సాధించారు. ఇందులో కొసమెరుపు ఏంటంటే ఆడవాళ్ళు ఇద్దరు ఏకగ్రీవమైతే మగవాళ్లు ఇద్దరు పోటీ చేసి మరీ గెలిచారు.