VIDEO: కోస్గిలో పబ్లిక్ టాయిలెట్స్‌కి తాళం
NRPT: కోస్గి పట్టణ పరిధిలోని వెజ్ టేబుల్ మార్కెట్‌లో నిర్మించిన పబ్లిక్ టాయిలెట్స్ వృథాగా మారాయి. కూరగాయల వ్యాపారులు, అక్కడికి వచ్చే వారి కోసం మార్కెట్ షెడ్‌తో పాటు ఉచిత ఆధునిక పబ్లిక్ టాయిలెట్స్ ఏర్పాటు చేశారు. ఇప్పుడు వీటిని నిర్వహించలేక తాళం వేశారు. మార్కెట్‌కు వచ్చే వారు బయటనే మూత్ర విసర్జన చేస్తుండడంతో ఆ ప్రాంతమంతా కంపుకొడుతోంది.