ఇద్దరు పంచాయతీ కార్యదర్శుల సస్పెన్షన్
SKLM: ఇచ్చాపురం(M) మండపల్లి పంచాయతీ కార్యదర్శులుగా విధులు నిర్వహించిన ఎస్. కృష్ణ, జి. గురుమూర్తిలను విధుల నుంచి సస్పెండ్ చేసినట్లు ఎంపీడీవో వై. ప్రభాకరరావు శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. పంచాయతీకి సంబంధించి ఆర్థిక వ్యవహారాల్లో తేడాలు రావడంతో వచ్చిన ఫిర్యాదు మేరకు డీపీవో భారతీ సౌజన్య నుంచి ఉత్తర్వులు అందాయని పేర్కొన్నారు.