నూతన డీఎంహెచ్వోగా డాక్టర్ విద్యా బాధ్యతల స్వీకారం

నూతన డీఎంహెచ్వోగా డాక్టర్ విద్యా బాధ్యతల స్వీకారం

కామారెడ్డి జిల్లా నూతన ఇన్‌ఛార్జ్ డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ (డీఎంహెచ్వో)గా డా. ఎం. విద్యా రాణ్ వల్కర్ బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆమె జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌తో జిల్లాలో ఆరోగ్య సేవల మెరుగుదల, వైద్య సిబ్బంది సమన్వయం, మాతా - శిశు ఆరోగ్య కార్యక్రమాల అమలు తదితర అంశాలపై చర్చించారు.