VIDEO: సమస్యలు పరిష్కరిస్తేనే ఓట్లు వేస్తాం: కాలనీవాసులు
MLG: కన్నాయిగూడెం (M) లక్ష్మీపురంలోని 2వ వార్డులో రోడ్డు కబ్జా కావడంతో స్థానికులు ఇవాళ ఆందోళనకు దిగారు. కొందరు వ్యక్తులు రోడ్డు మార్గంలో ఇంటి నిర్మాణం చేపట్టి, అడ్డుగా ఉన్న విద్యుత్ స్తంభాన్ని జరిపి మధ్యలో నాటారు. దీంతో వాహనాలు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. GP దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదన్నారు. సమస్య పరిష్కరిస్తేనే ఓట్లు వేస్తామని అన్నారు.