అగ్నికి ఆహుతైన డ్రిప్ పైపులు.. రూ.2లక్షలు నష్టం

అగ్నికి ఆహుతైన డ్రిప్ పైపులు.. రూ.2లక్షలు నష్టం

ప్రకాశం: కొండపి గ్రామానికి చెందిన రైతు వేమవరం శ్రీనివాసరావు డ్రిప్ ఇరిగేషన్ పైపులను తన పొలంలో ఉంచగా మంగళవారం అగ్నికి దగ్ధమయ్యాయి. స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో మంటలను అదుపు చేశారు. దగ్ధమైన డ్రిప్ పైపులు విలువ సుమారుగా రూ.2లక్షలు ఉంటుందని అంచనా. ఈ ప్రమాదం ప్రమాదవశాత్తు జరిగిందా? లేదా ఎవరైనా ఆకతాయిలు చేశారా? అనే విషయం తెలియాల్సి ఉంది.