గూడూరులో యూరియా కోసం రైతుల పడిగాపులు

MHBD: గూడూరు మండల కేంద్రంలో యూరియా పంపిణీని ప్రభుత్వం చేపట్టింది. అయితే, పంపిణీ ప్రక్రియ నెమ్మదిగా సాగుతుండటంతో చుట్టుపక్కల గ్రామాల రైతులు ఉదయం 5 గంటల నుంచే బారులు తీరి ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం తమ సమస్యలను పట్టించుకోవడం లేదని రైతులు తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఈ నిర్లక్ష్య ధోరణిపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.