వెల్దుర్తిలో విషాదం.. విద్యార్థి మృతి

వెల్దుర్తిలో విషాదం.. విద్యార్థి మృతి

KRNL: వెల్దుర్తికి చెందిన 9 ఏళ్ల ఎరుకల జయంత్ అనారోగ్యంతో జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నిన్న మృతి చెందాడు. జ్వరం, వాంతులు, కడుపునొప్పి, ముఖం వాపుతో బాధపడిన బాలుడిని మొదట స్థానిక PHCలో చేర్పించగా, పరిస్థితి విషమించడంతో కర్నూలుకు రిఫర్ చేశారు. అక్కడ చికిత్స పొందుతూ కోలుకోలేక మరణించినట్లు భందువులు తెలిపారు. తల్లిదండ్రులు రమేష్, రాజేశ్వరి దంపతులకు జయంత్ పెద్ద కుమారుడు.