శ్వేతార్క గణపతికి 256 కిలోల తేనెతో అభిషేకం

HNK: కాజీపేట పట్టణంలో కొలువుదీరిన స్వయంభు శ్రీ శ్వేతార్క మూల గణపతి స్వామి వారికి బుధవారం 256 కిలోల తేనెతో మధురాభిషేకంను అర్చకులు ఘనంగా నిర్వహించారు. ఆలయ వైదిక కార్యక్రమాల నిర్వాహకులు అయినవోలు సాయికృష్ణ శర్మ ఆధ్వర్యంలో సిద్ధి బుద్ధి సమేత శ్వేతార్కుడి కళ్యాణ మహోత్సవంను అంగరంగ వైభవంగా నిర్వహించారు.