'సర్పంచ్ రిజర్వేషన్‌లలో బీసీలకు అన్యాయం'
MNCL: భీమారంలోని పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లలో బీసీలకు అన్యాయం జరుగుతోందని ఐక్య వేదిక నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం మండలంలోని 11 పంచాయతీలు, ఆయా గ్రామాల వార్డుల్లో ఉన్న బీసీలకు తగిన స్థానాన్ని కేటాయించాలని డిమాండ్ చేస్తూ ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. బీసీలకు ఎంపీడీవో తప్పుడు నివేదికలతో ఒక్క స్థానం కూడా కేటాయించలేదని ఆరోపిస్తూ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు.