మత్స్యకారులు నదిలోకి వెళ్లకూడదు: కలెక్టర్

ELR: గోదావరి నదిలో వరద ప్రవాహం గంట గంటకు పెరుగుతున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రెవెన్యూ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. కలెక్టర్ వెట్రిసెల్వి ఆదేశాల మేరకు జంగారెడ్డిగూడెం రెవెన్యూ డివిజనల్ అధికారి ప్రజలకు పలు సూచనలు చేశారు. గోదావరి పరివాహక ప్రాంతంలో నివసిస్తున్న లాంచీలు, పడవలు నడిపేవారు, మత్స్యకారులు, ఎవ్వరూ నదిలోకి వెళ్లకూడదని స్పష్టం చేశారు.