నాగయ్యకు శాలివాహన సంఘం అండ

నాగయ్యకు శాలివాహన సంఘం అండ

అన్నమయ్య: కొత్త మంగంపేట గ్రామానికి చెందిన గొట్టం నాగయ్య పది రోజుల క్రితం రేషన్ బియ్యం తెచ్చుకొని ఇంటికి తిరిగి వస్తుండగా కాలు జారి ఎముక విరిగింది. ఈ సంఘటనపై సమాచారం తెలిసిన శాలివాహన సంఘం ప్రతినిధులు బుధవారం నాగయ్య కుటుంబాన్ని పరామర్శించి, సంఘం తరఫున ఆర్థిక సహాయం అందజేశారు. సాయం అందించేందుకు తాము ఎల్లప్పుడూ తోడుగా ఉంటామని భరోసా ఇచ్చారు.