మంచి మనసును చాటుకున్న యువకులు

మంచి మనసును చాటుకున్న యువకులు

MNCL: జన్నారంలో మతిస్థిమితం లేక రోడ్డుపై తిరుగుతున్న వ్యక్తికి బట్టలు వేసి యువకులు మంచి మనసును చాటుకున్నారు. మంగళవారం జన్నారం ప్రధాన రహదారిపై మతిస్థిమితం లేని వ్యక్తి నగ్నంగా సంచరించాడు. ఆ దృశ్యాన్ని చూసిన యువకులు గోలి చందు, ముడుగు ప్రవీణ్ ఆ వ్యక్తికి బట్టలు వేసి మంచి మనసును చాటుకున్నారు. మతిస్థిమితం లేని వ్యక్తి నగ్నంగా తిరగడం బాధను కలిగించిందన్నారు.