హర్మూజ్‌పై అధికారం ఇవ్వాల్సిందే: ఇరాన్
తాము యుద్ధాన్ని మొదలుపెట్టలేదని ఇరాన్ ప్రభుత్వ ప్రతినిధి ఫాతేమ్ మొహజిరానీ తెలిపారు. కానీ ఇప్పుడు తీవ్రంగా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఏ చర్చల్లోనైనా నష్టపరిహారం అంశం ఉంటుందన్నారు. పరిహారంలో భాగంగా హర్మూజ్ జలసంధిపై తమకు అధికారం ఇవ్వాల్సిందేని డిమాండ్ చేశారు. నియంత్రణతో పాటు తమ దేశంపై ఉన్న ఆంక్షలను తొలగించాలని కోరారు. అప్పుడు సుస్థిర శాంతి నెలకొంటుందని చెప్పారు.