గోదావరి పుష్కర ఘాట్ల వద్ద డీసీపీ పరిశీలన

గోదావరి పుష్కర ఘాట్ల వద్ద డీసీపీ పరిశీలన

PDPL: పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఆదేశాల మేరకు డీసీపీ రామ్ రెడ్డి గోదావరి పుష్కర ఘాట్ల ఏర్పాట్లు పరిశీలించారు. ఎల్లంపల్లి, గోలివాడ, గోదావరి బ్రిడ్జ్ ప్రాంతాల్లో భద్రత, బ్యారికేడింగ్, సీసీ కెమెరాలు, ట్రాఫిక్ మళ్లింపులపై సూచనలు చేశారు. మహిళలు, వృద్ధులకు ఇబ్బందులు లేకుండా సమగ్ర ప్రణాళిక అమలు చేయాలని ఆదేశించారు.