మండపాల ఏర్పాటుకు అనుమతి తప్పనిసరి: ఎస్పీ

W.G: ప్రశాంత వాతావరణంలో వినాయక చవితి ఉత్సవాలు నిర్వహించుకునేందుకు అవసరమైన అన్ని ముందస్తు జాగ్రత్తలు మండపాల నిర్వాహకులు పాటించాలని జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి తెలిపారు. మండపాల ఏర్పాటుకు అనుమతులు తీసుకోవాలని, పోలీసులు జారీ చేసే క్యూఆర్ కోడ్‌ను వాటి దగ్గర అతికించాలన్నారు. ఉదయం 6 నుంచి రాత్రి 10 గంటల వరకే లౌడ్ స్పీకర్లను ఉపయోగించాలని సూచించారు.