వాలంటీర్లు సమస్యలు పరిష్కరించండి: మమత

కృష్ణా: రాష్ట్రంలో ఉన్న రెండు లక్షల 50 వేల మంది వాలంటీర్ల సమస్యలను పరిష్కరించాలని వాలంటీర్ల రాష్ట్ర కార్యదర్శి మమత పేర్కొన్నారు. విజయవాడ గాంధీనగర్‌లో బుధవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వం ఏర్పడి 10 నెలలు గడుస్తున్నా వాలంటీర్లపట్ల ఎటువంటి సమాధానం చెప్పట్లేదని, తక్షణమే ప్రభుత్వం స్పందించి వాలంటీర్లను విధుల్లోకి తీసుకొని పెండింగ్ వేతనాలను చెల్లించాలన్నారు.