VIDEO: నరసాపురంలో భారీ చోరీ

VIDEO: నరసాపురంలో భారీ చోరీ

W.G: నరసాపురంలో తాళం వేసిన ఇళ్లే లక్ష్యంగా దొంగలు రెచ్చిపోతున్నారు. సోమవారం జోస్యుల వారి వీధి, సిద్ధాని వారి వీధిలలో రెండు ఇళ్ల తాళాలు పగలగొట్టి చోరీకి పాల్పడ్డారు. యాత్రకు వెళ్లిన సిద్ధాని శ్రీనివాస్ ఇంటి తలుపులు తెరిచి ఉండటాన్ని గుర్తించిన స్థానికులు సమాచారం ఇవ్వడంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు, క్లూస్ టీమ్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు.