చీరాల అభివృద్ధికి రూ.28.74 కోట్లు మంజూరు
BPT: చీరాల నియోజకవర్గానికి రూ.28.74 కోట్లు మంజూరైనట్లు ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య పేర్కొన్నారు. జల్ జీవన్ మిషన్ పథకం కింద పలు గ్రామాల్లో ఓవర్ హెడ్ ట్యాంకులు, పైప్ లైన్ నిర్మాణం, ఇంటింటికి నీటి కనెక్షన్లు, ఫిల్టర్ బెడ్ల మరమ్మత్తులకు ఈ నిధలు విడుదలైనట్లు తెలిపారు. చీరాల మండలానికి రూ.17.53 కోట్లు, వేటపాలెం మండలానికి రూ.11.21 కోట్లు కేటాయించిట్లు చెప్పారు.