ఆటోడ్రైవర్లకు ఎస్సై అవగాహన
ELR: జీలుగుమిల్లి మండలంలో ఆటో డ్రైవర్లు, యూనియన్లతో ఎస్సై క్రాంతి కుమార్ సమావేశ నిర్వహించారు. సైబర్ క్రైమ్స్, పొక్సో చట్టంపై వారికి అవగాహన కల్పించారు. డ్రైవర్లు తమ సేవలలో జాగ్రత్తగా ఉండాలని, ప్రయాణికుల భద్రతను ప్రథమ కర్తవ్యంగా తీసుకోవాలని సూచించారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించడంలో నిర్లక్ష్యం చేయొద్దని హెచ్చరిస్తూ, చట్టం ముందు అందరూ సమానమని ఆయన తెలిపారు.