గురుకుల పాటశాల నిర్మాణానికి చర్యలు
ADB: బేలా మండలంలో గురుకుల పాటశాల నిర్మాణానికి చర్యలు చేపడుతున్నట్లు తహసిల్దార్ రఘునందన్ పేర్కొన్నారు. శనివారం బేలా మండలంలోని మాంగృడ్ గ్రామంలో 5 ఎకరాలు ప్రభుత్వ భూమిని సర్వేయర్ అఖిలతో కలిసి పరిశీలించారు. వారితో పాటు స్థానిక మాజీ ఎంపిటిసి ఠాక్రే మంగేష్ కుమార్, టేకం నేతాజీ, మనోహర్, రూపేష్ , కైలాష్ గ్రామస్తులు తదితరులు ఉన్నారు.