'ధాన్యం కొనుగోలుకు అన్నీ సిద్ధం చేశాం'
W.G: ఖరీఫ్ ధాన్యం కొనుగోలుకు అన్నీ సిద్ధం చేశామని జిల్లా పౌర సరఫరాల శాఖ మేనేజర్, MD ఇబ్రహం తెలిపారు. రైతు భరోసా కేంద్రాల వద్ద గతంలో తలెత్తిన సమస్యలు పునరావృతం కాకుండా రైతుల సమస్యలు తక్షణం పరిష్కరించేందుకు, రైతులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా సహాయకులను నియమించినట్లు MDపేర్కొన్నారు. రైతులు ధాన్యాన్ని నచ్చిన కేంద్రంలో విక్రయించుకోవచ్చని తెలపారు.