చమురు ధరల కట్టడికి IEA భారీ నిర్ణయం
ప్రపంచ చమురు మార్కెట్లో ధరలను స్థిరీకరించేందుకు ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ(IEA) చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ఏకంగా 400 మిలియన్ బ్యారెళ్ల ముడి చమురును అత్యవసర నిల్వల నుంచి విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. ఇంధన సరఫరాలో ఆటంకాలు, పెరుగుతున్న ధరలను అరికట్టడమే లక్ష్యంగా ఈ భారీ చర్య చేపట్టింది. ఈ నిర్ణయం వల్ల అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు దిగివచ్చే అవకాశం ఉంది.