మెరుగైన వైద్య సేవలు అందించాలి: కలెక్టర్

HNK: ప్రభుత్వ ప్రసూతి వైద్య శాలలో గర్భిణులు, బాలింతలకు మెరుగైన వైద్య సేవలను అందించాలని కలెక్టర్ స్నేహ శబరీశ్ అన్నారు. సోమవారం హన్మకొండలోని ప్రభుత్వ ప్రసూతి వైద్య శాలను వారు సందర్శించారు. ఈ సందర్భంగా ఆసుపత్రికి వస్తున్న ఓపీ, ఐపీ సేవలు, డెలివరీ కేసుల గురించిన వివరాలను వైద్యాధికారులను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.