విద్యుత్ షాక్ తగిలి యువకుడు మృతి

NRML: విద్యుత్ షాక్‌కు గురై యువకుడు మృతి చెందిన ఘటన కడెం మండలంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. కడెం మండలంలోని కొండుకూరు గ్రామానికి చెందిన సంఘం రాజు ( 37 ) కూలి పనికి వెళ్ళాడు. అక్కడ పంట పొలం వద్ద గడ్డి కోస్తుండగా విద్యుత్ షాకు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతునికి భార్య ,ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు.