నూతన గృహప్రవేశ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే
ELR: జీలుగుమిల్లి మండలం తాటియాకులగూడెం గ్రామంలో బుధవారం అందరికీ ఇళ్లు పథకంలో భాగంగా నూతన గృహప్రవేశ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి పేద కుటుంబానికి సొంత ఇళ్లు కల్పించాలనే సంకల్పంతో ఈ పథకాన్ని అమలు చేస్తున్నదని తెలిపారు. ఈ పథకం ద్వారా వేలాది కుటుంబాల సొంత గృహ స్వప్నాన్ని సాకారం చేసుకుంటున్నాయని చెప్పారు.