VIDEO: కోతకు గురైన వీటీపీఎస్ కూలింగ్ కెనాల్ కట్ట

VIDEO: కోతకు గురైన వీటీపీఎస్ కూలింగ్ కెనాల్ కట్ట

కృష్ణా: ఇబ్రహీంపట్నం వీటిపిఎస్‌కు సంబంధించిన కూలింగ్ కెనాల్ కరకట్ట కోతకు గురైంది. బుధవారం కురిసిన భారీ వర్షాల కారణంగా ఈ కట్ట కోతకు గురైంది. గతంలో కూడా వర్షాలు కురిసినప్పుడు కోతకు గురికాగా నామమాత్రపుగా కట్టను పూడ్చటంజరిగిందని స్థానికులు వాపోయారు. గురువారం నీటి ప్రవాహానికి కట్ట మీద ఉన్న రేకుల షెడ్డు కూలిపోయింది. దీంతో అక్కడి ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.