పాము కాటుకు గురై మహిళ మృతి

పాము కాటుకు గురై మహిళ మృతి

కోనసీమ: ముమ్మిడివరం నగర పంచాయతీ పరిధిలోని రాజుపాలెం గ్రామంలో పాముకాటుకు గురై వివాహిత మృతి చెందింది. గురువారం ఉదయం రాజుపాలెం గ్రామ ప్రధాన రహదారిపై వాకింగ్‌కు వెళ్లిన యనమదల ప్రవళ్లిక(27)ను పాము కాటేసింది. ఆమెను వెంటనే స్థానికులు ముమ్మిడివరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు గుర్తించారు.