ఊరు వెళ్ళే వారికి ముఖ్య గమనిక..!
NTR: వేసవి సెలవుల నేపథ్యంలో ఊర్లకు వెళ్లే ప్రజలు తమ ఇళ్ల భద్రత కోసం LHMS (లాక్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్) సేవలను తప్పనిసరిగా వినియోగించుకోవాలని విజయవాడ సెంట్రల్ ACP దామోదర్ సూచించారు. ఇళ్లను ఖాళీగా వదిలి వెళ్లే సమయంలో దొంగతనాలు జరగకుండా పోలీస్ శాఖ ప్రత్యేకంగా అందిస్తున్న ఈ సేవను ప్రజలు ఉపయోగించుకోవాలన్నారు.