కొట్టక్కిలో శంకుస్థాపనకు సర్వం సిద్ధం

VZM: రామభద్రపురం మండలం కొట్టక్కిలో ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న ఎంఎస్ఎంఈ పార్కు శంకుస్థాపనకు సర్వం సిద్ధం చేసినట్లు తహశీల్దార్ సులోచనారాణి తెలిపారు. హోమ్ మంత్రి అనిత చేతుల మీదుగా ఈరోజు ఉదయం 10 గంటలకు శంకుస్థాపన జరగనుంది. 187.22 ఎకరాల విస్తీర్ణంలో స్థలాన్ని గుర్తించి కేటాయించామన్నారు. మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు, ఎమ్మెల్యే బేబినాయన తదితరులు పాల్గొన్నారు