రష్యా కీలక పోర్టును దెబ్బతీసిన ఉక్రెయిన్‌

రష్యా కీలక పోర్టును దెబ్బతీసిన ఉక్రెయిన్‌

రష్యా చమురు ఎగుమతుల్లో అత్యంత కీలక పాత్ర పోషిస్తున్న ఉస్త్ లుగా నౌకాశ్రయంపై ఉక్రెయిన్ డ్రోన్లతో విరుచుకుపడింది. వారం క్రితం జరిగిన దాడిలో ఈ పోర్టు కొంత మేర ధ్వంసం కావడంతో ఇప్పటికే ఎగుమతులను నిలిపివేశారు. తాజాగా ఈ పోర్టును ఉక్రెయిన్ డ్రోన్లు మరోసారి తీవ్రంగా దెబ్బతీశాయి. రష్యా నుంచి భారత్‌కు ఇంధనం సరఫరా చేసే పోర్టుల్లో ఉస్త్ లుగా పోర్టు కూడా కీలకమైంది.