ఒక్కటైన సిరిసిల్ల జిల్లా అబ్బాయి.. ఇటలీ అమ్మాయి

ఒక్కటైన సిరిసిల్ల జిల్లా అబ్బాయి.. ఇటలీ అమ్మాయి

SRCL: ఇటలీ దేశానికి చెందిన యువతి, రుద్రంగికి చెందిన యువకుడు హిందూ సంప్రదాయ పద్ధతిలో వివాహం చేసుకున్నారు. సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రానికి చెందిన ఓలిమినేని నిత్యానందరావు-వీణారాణి దంపతుల కుమారుడు శ్రీకర్ రావు ఫ్రాన్స్ దేశంలో ఉన్నత విద్య అభ్యసించాడు. ఆ క్రమంలో ఇటలీకి చెందిన వైద్యురాలు ఫెదిరికతో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారి పెళ్లి చేసుకున్నారు.