నవరాత్రి ఉత్సవాలలో డీజే ఏర్పాటు చేస్తే సీజ్

ADB: గణేష్ నవరాత్రి ఉత్సవాలలో భారీ శబ్దంతో కూడిన డీజే లను ఏర్పాటు చేస్తే సీజ్ చేస్తామని రూరల్ సీఐ ఫణిదర్ అన్నారు. బుధవారం తలమడుగు మండల కేంద్రంలో గణేష్ మండపాల నిర్వహణతో శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు. సీఐ మాట్లాడుతూ.. నిర్వాహకులు తప్పనిసరిగా పోలీసుల అనుమతి తీసుకోవాలని సూచించారు. సీఐతో పాటు ఎస్సై రాధిక, నిర్వాహకులు ఉన్నారు.