BREAKING: టీమిండియాకు భారీ నజరానా
టీమిండియాకు BCCI భారీ నజరానా ప్రకటించింది. టీ20 ప్రపంచకప్ విజేతగా నిలిచిన టీమిండియాకు రూ.131 కోట్ల నగదు బహుమతి ఇవ్వనున్నట్లు తెలిపింది. కాగా, T20 WC-2026లో భాగంగా జరిగిన ఫైనల్‌లో న్యూజిలాండ్ జట్టుపై భారత్ సాధించిన ఈ విజయంతో వరుసగా రెండుసార్లు ట్రోఫీని నిలబెట్టుకున్న తొలి జట్టుగా, అలాగే మూడుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన ఏకైక జట్టుగా భారత్ రికార్డు సృష్టించింది.