వచ్చే శ్రీరామనవమిలోగా ఛత్రపతి శివాజీ విగ్రహం: ఎమ్మెల్యే
ATP: అనంతపురలో వచ్చే ఏడాది శ్రీరామనవమి నాటికి ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని MLA దగ్గుపాటి ప్రసాద్ ప్రకటించారు. శ్రీరామనవమి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన బైక్ ర్యాలీలో ఆయనతో పాటు హిందూ ధర్మ పరిరక్షకుడు రాధా మనోహర్ దాస్ హాజరయ్యారు. తెల్లని వస్త్రాలు, కాషాయ తలపాగా ధరించిన ఎమ్మెల్యే జై శ్రీరామ్ నినాదాల మధ్య ర్యాలీని ప్రారంభించారు.