నూతన సీఐగా కే.మహేశ్ బాధ్యతలు స్వీకరణ

నూతన సీఐగా కే.మహేశ్ బాధ్యతలు స్వీకరణ

MBNR: జడ్చర్ల నూతన సర్కిల్ ఇన్స్పెక్టర్‌గా కె. మహేశ్ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో గద్వాల జిల్లాలో పనిచేసిన ఆయన, నాగార్జున గౌడ్ బదిలీతో ఇక్కడికి వచ్చారు. బాధ్యతలు చేపట్టిన మహేశ్‌కు సిబ్బంది ఘన స్వాగతం పలికారు. శాంతిభద్రతల పరిరక్షణ, ప్రజల భద్రతే తన ప్రథమ ప్రాధాన్యమని ఆయన తెలిపారు. నేరాల నియంత్రణకు ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామన్నారు.