గొంతులో గుడ్డు ఇరుక్కుని వ్యక్తి మృతి

NGKL: గొంతులో గుడ్డు ఇరుక్కుని వ్యక్తి మృతిచెందిన ఘటన కల్వకుర్తి మండలంలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. ముకురాలకి చెందిన ఈశ్వరయ్య (55) నిన్న రాత్రి భోజనం చేస్తుండగా గుడ్డు గొంతులో ఇరుక్కుంది. దీంతో అపస్మారక స్థితిలోకెళ్లిన ఆయనను కుటుంబసభ్యులు ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఊపిరాడక మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.