వైద్య ఖర్చులకు ఎల్‌వోసీ మంజూరు
SRCL: చందుర్తి మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన ఎడ్ల మల్లేశం అనారోగ్య సమస్యల వలన అత్యవసర చికిత్స అవసరం ఉoదని వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ దృష్టికి తీసుకెళ్లగా తక్షణమే స్పందించారు. నిమ్స్ ఆసుపత్రిలోని వైద్య సిబ్బందితో మాట్లాడి చికిత్స అందించాలని ఆదేశిస్తూ ప్రభుత్వం నుంచి రూ. 1,50,000 వైద్య ఖర్చులకు డబ్బులు మంజూరు చేయించారు.