గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం

JGL: మెట్‌పల్లి పట్టణంలో మంగళవారం గుర్తుతెలియని మృతదేహాన్ని గుర్తించినట్లు ఎస్సై కిరణ్ కుమార్ తెలిపారు. స్థానిక విద్యుత్ ఉపకేంద్రం వెనుక యువకుడి మృతదేహాన్ని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. మృతుడి వయసు సుమారు 30 నుంచి 35 ఏళ్ల వరకుంటుందని ఎస్సై పేర్కొన్నారు. మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించామని పోలీసులు తెలిపారు.