రహదారి భద్రతకు పోలీసుల చర్యలు

రహదారి భద్రతకు పోలీసుల చర్యలు

W.G: జాతీయ రహదారిపై ప్రమాదాల నివారణకు పోలీసు అధికారులు చర్యలు చేపట్టారు. 216 జాతీయ రహదారిపై తరచూ జరుగుతున్న ప్రమాదాలను దృష్టిలో ఉంచుకుని, ONGC సామాజిక బాధ్యతా పథకం కింద మొగల్తూరులోని ప్రమాదకరమైన కూడళ్ల వద్ద ప్లాస్టిక్ డబ్బాలను ఏర్పాటు చేశారు. ఈ ఏర్పాట్లను శనివారం డీఎస్పీ శ్రీవేదతోపాటు ఇతర పోలీసు అధికారులు పర్యవేక్షించారు.