యూరియా సకాలంలో అందించేందుకు ప్రత్యేక యాప్
SRD: రైతులకు సకాలంలో యూరియా అందేలా ప్రత్యేక యాప్ రానున్నట్లు ఖేడ్ ADA నూతన కుమార్ మంగళవారం తెలిపారు. యూరియా కొనుగోలులో ఈ పాస్ సిస్టం ల్యాండ్ రికార్డ్ ఆధారంగా యూరియా సరఫరా చేస్తారని చెప్పారు. యూరియా పక్కదారి పట్టకుండా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలోనే యాప్ నిర్వహిస్తున్నట్లు చెప్పే తెలిపారు. ఈ యాప్ ద్వారా డీలర్ వద్ద ఎన్ని బ్యాగులు ఉన్నాయో ఈజీగా తెలుస్తుందన్నారు.