VIDEO: మూగజీవులకు నేస్తం 'నాగభూషణం'

VIDEO: మూగజీవులకు నేస్తం 'నాగభూషణం'

SRD: కంగ్టి మండలం జంమ్గి(బి)కి చెందిన నాగభూషణం మూగజీవులపై అపారమైన ప్రేమను చాటుకుంటున్నారు. గత తొమ్మిదేళ్లుగా అడవిలోని జంతువుల దాహార్తి తీర్చడమే లక్ష్యంగా శ్రమిస్తున్నారు. రోజూ తన బైకుపై 2 కి.మీ ప్రయాణించి, ఉదయం, సాయంత్రం కలిపి 120 లీటర్ల నీటిని గట్టుపై ఉన్న సిమెంట్ తొట్టిలో నింపుతున్నారు. ఆయన చేస్తున్నకృషి జంతువుల పట్ల ఆయనకున్న అంకితభావాన్ని, మానవత్వాన్ని చాటుతోంది.